హైటీ బుమ్!
జాతీయ సగటును మించిన ఐటీ ఉత్పత్తుల ఆదాయం
కొలువుదీరనున్న మరో 100 కంపెనీలు
ఐటీ పాలసీపై పారిశ్రామికవేత్తల ఆసక్తి
హైటెక్ మహానగరం ఐటీకి రాజధానిగా మారుతోంది. సీఎం కేసీఆర్ సోమవారం ఐటీ పాలసీ ప్రకటించనున్న నేపథ్యంలో నగరం ఇక ఐటీ రంగంలో తిరుగులేని శక్తిగా ఎదిగే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఐటీ రంగం రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం మొదటిసారిగా రంగంలోకి దిగుతోంది. ఈ రంగంలో కొత్త అవకాశాలు సృష్టించేందుకు పెద్దఎత్తున రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటించే అవకాశం ఉంది. ఐటీ పరిశ్రమైపైన స్పష్టమైన విధానాలు ప్రకటించనున్నందున అన్ని ప్రముఖ ఐటీ కంపెనీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకర ప్రకటనలుంటే వెంటనే రంగంలోకి దిగాలని వేచి చూస్తున్నాయి.
తద్వారా నగరంలో ఐటీ రంగం మెరుగుపడడంతోపాటు వేలాది మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. మరోవైపు గతేడాది ఐటీ ఎగుమతుల్లో 16 శాతం వృద్ధి నమోదైనట్లు ఐటీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ వృద్ధి రేటు జాతీయస్థాయి ఐటీ ఎగుమతుల్లో పెరుగుదల కంటే 3 శాతం అధికం. ఈ అంశం కూడా నగరంలో ఐటీ వృద్ధికి తోడ్పడుతుందని భావిస్తున్నారు.
- సాక్షి, సిటీబ్యూరో