మరో 6 ఇంజినీరింగ్ కాలేజీలకు అనుమతి | JNTUH permits affiliation to 6 engineering colleges | Sakshi
Sakshi News home page

మరో 6 ఇంజినీరింగ్ కాలేజీలకు అనుమతి

Published Thu, Jul 7 2016 5:11 PM | Last Updated on Mon, Sep 4 2017 4:20 AM

మరో ఆరు ఇంజినీరింగ్ కాలేజీలకు జేఎన్‌టీయూహెచ్ అనుబంధ గుర్తింపు మంజూరు చేసింది.

హైదరాబాద్: మరో ఆరు ఇంజినీరింగ్ కాలేజీలకు జేఎన్‌టీయూహెచ్ అనుబంధ గుర్తింపు మంజూరు చేసింది. కాలేజీల్లో లోపాలు సరిదిద్దుకున్నట్లు తేలడంతో వాటిల్లో ప్రవేశాలకు ఓకే చెప్పినట్లు అధికారులు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లాలోని కేఎన్‌ఆర్‌ఆర్, మల్లారెడ్డి, మల్లారెడ్డి (మహిళ), ఎన్‌ఆర్‌ఐ కాలేజీలు, నల్లగొండ జిల్లా కోదాడలోని గాంధీ అకాడమీ, శ్రీసాయి కాలేజీలకు అనుబంధ గుర్తింపు మంజూరు చేశారు.

వాటిని కౌన్సెలింగ్‌లో పెట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇక వీఎన్‌ఆర్ విజ్ఞాన్‌ జ్యోతి కాలేజీలో కోత విధించిన కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (సీఎస్‌ఈ), ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈసీఈ) కోర్సులకు అనుబంధ గుర్తింపు లభించలేదు. దీనిపై కాలేజీ యాజమాన్యం కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధం అయినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement