'ఆంధ్రాలో ఓ వ్యక్తి దెబ్బకు కాంగ్రెస్ చచ్చిపోయింది' | Kalvakuntla Taraka Rama Rao takes on Sonia Gandhi | Sakshi
Sakshi News home page

'ఆంధ్రాలో ఓ వ్యక్తి దెబ్బకు కాంగ్రెస్ చచ్చిపోయింది'

Published Wed, Apr 16 2014 12:16 PM | Last Updated on Sat, Jul 6 2019 3:48 PM

'ఆంధ్రాలో ఓ వ్యక్తి దెబ్బకు కాంగ్రెస్ చచ్చిపోయింది' - Sakshi

'ఆంధ్రాలో ఓ వ్యక్తి దెబ్బకు కాంగ్రెస్ చచ్చిపోయింది'

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ దేవత కాదని... బలిదేవత అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అభివర్ణించారు. బుధవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో సోనియా గాంధీపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం 1200 మంది చనిపోయిన తర్వాత సోనియా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించారని ఆరోపించారు. ముందుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని సోనియాను కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆంధ్రాలో ఓ వ్యక్తి కొట్టిన దెబ్బకు కాంగ్రెస్ చచ్చిపోయిందని... ఆ తర్వాతే రాజకీయ అవకాశవాదంతోనే తెలంగాణ ఇచ్చారని సోనియాపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమేత్తారు. తెలంగాణ ఇవ్వడంలో ఎందుకు ఆలస్యమైంది సహ ఇతర అంశాలపై కరీంనగర్ సభలో సోనియా వివరణ ఇవ్వాలన్నారు.

తెలంగాణ ద్రోహుల్ ఎవరో  ... టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల సొంతూరులో చర్చకు సిద్ధమని కేటీఆర్ సవాల్ విసిరారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహూల్ గాంధీ ఒడిపోతారని సర్వేలు చెబుతున్నాయని... అలాంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓటెయ్యాలని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చినట్లు  తెలంగాణ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అలాగే కేంద్ర మంత్రి, జీవోఎం సభ్యుడు జైరాం రమేష్ బుద్దిమాంధ్యం గల నేతగా కేటీఆర్ అభివర్ణించారు. విశ్వాస ఘాతకుల చేతిలో తెలంగాణ పెడితే ప్రయోజనం ఉండదని ఆ ప్రాంత ప్రజల సూచించారు. ప్రముఖ సినీ నటుడు, జన సేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై ఆగ్రహం వ్యక్తం చేశారు.  పార్టీ పేరు జన సేన తీసేసి.... మోడీ భజన సేనగా మార్చుకోవాలని పవన్కు కేటీఆర్ సూచించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement