హైదరాబాద్ రానున్న కన్హయ్య కుమార్ | Kanhaya Kumar today to City | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ రానున్న కన్హయ్య కుమార్

Published Wed, Mar 23 2016 5:50 AM | Last Updated on Sun, Sep 3 2017 8:20 PM

హైదరాబాద్ రానున్న కన్హయ్య కుమార్

హైదరాబాద్ రానున్న కన్హయ్య కుమార్

హెచ్‌సీయూలో రోహిత్ స్మారకానికి నివాళి

 హైదరాబాద్: రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రెండు సభల్లో పాల్గొనేందుకు ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ హైదరాబాద్‌కు రానున్నట్లు సీపీఐ గ్రేటర్ కార్యదర్శి డాక్టర్ సుధాకర్ తెలిపారు. సభలకు సంబంధించిన రాజ్యాంగ పరిరక్షణ సదస్సు పోస్టర్‌లను మంగళవారం నగరంలోని మఖ్దూం భవన్లో పలు సంఘాల నాయకులతో కలసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ కన్హయ్య బుధవారం సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకుని హెచ్‌సీయూకు వెళతారన్నారు.

అక్కడ రోహిత్ స్మారక స్తూపానికి నివాళి అర్పించి రోహిత్ తల్లికి సంఘీభావం ప్రకటిస్తారన్నారు. అనంతరం హెచ్‌సీయూలో జరిగే సభలో ఆయన ప్రసంగిస్తారన్నారు. గురువారం ఉదయం 10.30 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సదస్సులో కన్హయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రజలను చైతన్యపరుస్తారన్నారు. దేశంలో మోదీ ప్రభుత్వం ఓ మతానికి మొగ్గు చూపుతూ భావ స్వేచ్ఛను అరికడుతోందని సుధాకర్ ఆరోపించారు. వీటన్నింటిపై కన్హయ్య ప్రసంగిస్తారని ఆయన వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement