దేశ చరిత్రలోనే ఇది కొత్త అంకం: కేసీఆర్ | KCR inaugurate 2BHK houses at IDH Colony | Sakshi
Sakshi News home page

దేశ చరిత్రలోనే ఇది కొత్త అంకం: కేసీఆర్

Published Mon, Nov 16 2015 3:06 PM | Last Updated on Sat, Sep 29 2018 4:44 PM

దేశ చరిత్రలోనే ఇది కొత్త అంకం: కేసీఆర్ - Sakshi

దేశ చరిత్రలోనే ఇది కొత్త అంకం: కేసీఆర్

సికింద్రాబాద్ : తెలంగాణ ముఖ్యంత్రి కె.చంద్రశేఖరరావు సోమవారం సికింద్రాబాద్‌లో ఐడీహెచ్ కాలనీలో డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు కూడా ఆత్మగౌరవంతో బ్రతకాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని, అందుకే వారి కోసం డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించామన్నారు. భారతదేశ చరిత్రలోనే ఇది కొత్త అంకమన్నారు.  ఇక నుంచి పేదలకు కట్టే ఇళ్లన్నీ డబుల్ బెడ్ రూంలే ఉంటాయని కేసీఆర్ తెలిపారు.

నియోజకవర్గానికి 400 చొప్పున డబుల్ బెడ్ రూం ఇళ్లను కట్టిస్తామని ఆయన పేర్కొన్నారు. అర్హులకు ఇళ్ల పట్టాలను అందచేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహేందర్ రెడ్డి, పద్మారావు తదితరులు హాజరయ్యారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement