ఇలాంటి గవర్నర్‌ను చూడలేదు | komati reddy venkata reddy commented on narasimhan | Sakshi
Sakshi News home page

ఇలాంటి గవర్నర్‌ను చూడలేదు

Published Tue, Jan 3 2017 3:36 AM | Last Updated on Wed, Aug 15 2018 9:37 PM

ఇలాంటి గవర్నర్‌ను చూడలేదు - Sakshi

ఇలాంటి గవర్నర్‌ను చూడలేదు

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
జహీరాబాద్‌: అందరిని సమానంగా చూడా ల్సిన గవర్నర్‌ నరసింహన్ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబ సభ్యుల జపం చేయడం సరికాదని కాంగ్రెస్‌ శాసనసభా పక్ష ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని గవర్నర్‌ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ను, ఆయన కుమారుడు కేటీఆర్‌ను మెచ్చుకోవడం తగదన్నారు. గతంలో ఏ గవర్నర్‌ కూడా ఇలా ప్రత్యేకంగా మెచ్చుకున్న దాఖలాలు లేవన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధాని నరేంద్ర మోదీ జపం చేస్తుండగా.. గవర్నర్‌  కేసీఆర్‌ జపం చేస్తున్నారని దుయ్యబట్టారు.

పెద్ద నోట్ల రద్దుతో 90 శాతం మంది ప్రజలు నానా అవస్థలు పడుతున్నా.. సీఎం మాత్రం ప్రధానిని మెచ్చుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. మోదీ ప్రసంగం నిరాశ పర్చిం దని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారని, కేసీఆర్‌ మాత్రం స్పందించక పోవడం దారుణమన్నారు. తుగ్లక్‌ పాలనను తలపిం చే విధంగా రాష్ట్ర సర్కార్‌ కొనసాగుతోందని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement