మహిళా సమస్యలపై పోరాడాలి: భట్టి
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వివక్షపై పోరాటం చేయాలని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క మహిళా కాం గ్రెస్ నేతలకు సూచించారు. బుధవారం గాంధీభవన్‌లో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఇందులో భట్టి మాట్లాడుతూ... రాష్ట్రంలో మహిళల సమస్యలపై తక్షణమే స్పందించాలన్నారు. మహిళలు కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉంటేనే పార్టీపై విశ్వా సం, ఆదరణ పెరుగుతుందన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి దాకా ప్రత్యేక మహిళా కమిటీలను ఏర్పాటుచేసుకోవాలని భట్టి సూచిం చారు. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు నేరేళ్ల శారద, మాజీ ఎమ్మెల్యే అరుణతార తదితరులు పాల్గొన్నారు.
మైనారిటీ సెల్ సమావేశం
కాంగ్రెస్ మైనారిటీ సెల్ సమావేశం కూడా గాంధీభవన్‌లో జరిగింది. మైనారిటీ సెల్ బలోపేతం కోసం అనుసరించాల్సిన వ్యూహంపై భట్టి దిశానిర్దేశం చేశారు. మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఫకృద్దీన్ పాల్గొన్నారు.