మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మెట్ల సత్యనారాయణ శుక్రవారం మృతి చెందారు. కొంతకాలంగా ఆయన రెండు కిడ్నీలు పాడై అనారోగ్యంతో బాధపడుతున్నారు.
హైదరాబాద్: మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మెట్ల సత్యనారాయణ శుక్రవారం మృతి చెందారు. కొంతకాలంగా ఆయన రెండు కిడ్నీలు పాడై అనారోగ్యంతో బాధపడుతున్నారు. సోమవారం నుండి హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో ఉదయం పది గంటల ప్రాంతంలో కన్నుమూశారు.
ఆయన భౌతికకాయాన్ని కేంద్రమంత్రి సుజనాచౌదరి, కేంద్ర మాజీమంత్రి పల్లంరాజు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, ఎంపీ తోట నర్సింహులు, ఎమ్మెల్సీ వి.వి.ఎస్.చౌదరి, మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు విశ్వరూప్‌లు సందర్శించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అందరి మన్ననలు పొందిన వ్యక్తి మెట్ల సత్యనారాయణ అని కొనియాడారు. సత్యనారాయణ మృతితో ఆంధ్రప్రదేశ్ ఓ గొప్ప నాయకుడిని కోల్పోయిందన్నారు.