అదిగో..అదిగదిగో..!
మూడేళ్ల ముచ్చట
‘మెట్రో’ పరుగులు వాయిదా
సిటీబ్యూరో: గ్రేటర్‌లో మెట్రో కల రోజు రోజుకూ దూరమవుతోంది. అదిగో.. ఇదిగో అంటూ ఊరిస్తున్న మెట్రో ప్రారంభోత్సవం వాయిదా పడుతూనే వస్తోంది. నాగోల్–రాయదుర్గం, ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఫలక్‌నుమా మూడు కారిడార్లలో 72 కిలోమీటర్ల మార్గంలో పనులు జరుగుతున్నాయి. 2012లో మొదలైన పనుల్లో ఇప్పటివరకు 75 శాతం మేర పనులు పూర్తయ్యాయి.
నాగోల్–మెట్టుగూడ(8కి.మీ), మియాపూర్–ఎస్.ఆర్.నగర్(12కి.మీ) రూట్లలో మెట్రో ప్రారంభానికి సిద్ధంగా ఉన్నా ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేయలేదు.వివిధ సమస్యల కారణంగా గడువు 2017 జూన్ నుంచి 2018 డిసెంబరుకు చేరుకొంది.పాతనగరంలో ఎంజీబీఎస్–ఫలక్‌నుమా రూట్లో 5.3 కి.మీ మార్గంలో అలైన్‌మెంట్ ఖరారు చేయకపోవడంతో ఈ రూట్‌లో పనులు నిలిచాయి.