
'ఉగాదికి మెట్రో రైలు పట్టాలెక్కడం లేదు'
హైదరాబాద్ : అనుకున్నట్లే అయింది. మెట్రో రైలు ఉగాదికి పట్టాలు ఎక్కటం లేదు. ఈ విషయాన్ని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి సోమవారమిక్కడ తెలిపారు. అంతా సవ్యంగా జరిగితే మార్చి 21 (ఉగాదిన)న మెట్రో రైలు సర్వీసును నాగోలు- మెట్టగూడల మధ్య ప్రారంభం కావాల్సి ఉండేది. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల మెట్రో రైలు తొలిదశ ప్రారంభం కావటం లేదని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.. మొత్తం ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాతే మెట్రో రైలు ఆరంభం అవుతుందని ఆయన తెలిపారు. కాగా ఇప్పటికే నాగోల్-మెట్టుగూడ రూట్లో మెట్రో స్టేషన్ల నిర్మాణం తుది దశకు చేరుకుంది.