ఆర్టీసీ అంటేనే.. ప్రజాసేవ
మంత్రి మహేందర్ రెడ్డి
హైదరాబాద్: ఆర్టీసీ అంటేనే ప్రజలకు సేవలు అందించేది అని, అలాంటి సంస్థను బలోపేతం చేసేందుకు కార్మికులందరు కృషి చేయాలని రవాణా మంత్రి పి.మహేందర్ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ ఆర్టీసీ కళ్యాణ మండపంలో టీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలో డ్రైవర్లు, మెకానిక్‌లకు కెఎంపీఎల్ అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. ఆర్టీసీకి చెందిన 62 స్థలాలను హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీకి ఇచ్చి అక్కడ పంపులను ఏర్పాటు చేస్తే కొంత మేర ఇంధనం ఆదా చేయవచ్చని అన్నారు.
అనంతరం డ్రైవర్లు వీరేషం (కరీంనగర్), ఎంఎం.సింగ్ (పరిగి), బీఎల్.మూర్తి (ఖమ్మం), కె.శంకర్ (ఉప్పల్), రాజేందర్ (హన్మకొండ), రాములు (ఆర్మూర్), నాగిరెడ్డి (వనపర్తి), ఎన్‌జే.రెడ్డి (సిద్దిపేట), రాజేశ్వర్ (నిర్మల్), కె.ఎన్.రెడ్డి (యాదగిరిగుట్ట)కు అవార్డులను ప్రదానం చేశారు.