చంద్రబాబుపై రాచమల్లు ధ్వజం
సాక్షి, హైదరాబాద్: సీఎం చంద్రబాబు పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నపుడు అధికారం పక్షంపై ఆరోపణలు, విమర్శలు చేయలేదా? అపుడో నీతి, ఇపుడో నీతి ఎందుకు? అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి సూటిగా ప్రశ్నించారు. సోమవారం రాత్రి ఆయన మీడియాపాయింట్ వద్ద మాట్లాడారు. ప్రతిపక్షం అధికారపక్షంపై ఆరోపణలు చేయొద్దనడం సరికాదన్నారు.
‘పరిటాల రవి హత్యతో జగన్‌కు సంబంధం ఉందని ఇప్పుడు కూడా ఆరోపణలు చేస్తున్న టీడీపీ వద్ద సాక్ష్యాలున్నాయా? జగన్ రూ.43 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని చెబుతున్న టీడీపీ వారేమైనా ఆ డబ్బును లెక్కించి చూశారా? సాక్ష్యాలుండే మీరు మాట్లాడుతున్నారా?’ అని ప్రశ్నించారు. గత బుధవారం శాసనసభలో తాను లేకున్నా సస్పెం డ్ చేశారని, నిర్ధరించుకోకుండా సస్పెండ్ చేసిన ఈ గుడ్డి ప్రభుత్వానికి సాక్ష్యాలు కావాలా? అని నిలదీశారు. సభ జరిగిన తీరు చూస్తే అధికారపక్షమే ప్రతిపక్షంపై అవిశ్వాసం పెట్టినట్లుగా ఉందన్నారు.
ప్రతిపక్షంలో ఉన్నపుడు ఆరోపణలుచేయలేదా?
Published Tue, Mar 15 2016 2:57 AM | Last Updated on Tue, Oct 30 2018 5:08 PM
Advertisement
Advertisement