అసైన్ మెంట్ కమిటీలను పునరుద్ధరించాలి
సీఎంకు ఎమ్మెల్యే రవీంద్ర విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: భూ పంపిణీ కార్యక్రమాలను చేపట్టేందుకు అసెంబ్లీ ల్యాండ్ అసైన్‌మెంట్ కమిటీలను ఏర్పాటుచేయాలని సీఎం కే సీఆర్‌కు సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు బుధవారం సీఎం కేసీఆర్‌కు సీపీఐ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ లేఖను రాశారు. దీర్ఘకాలంగా సాగులో ఉన్న ప్రభుత్వ భూములను క్రమబద్ధీకరించాలన్నారు. అసెంబ్లీ ల్యాండ్ అసైన్‌మెంట్ కమిటీల ఏర్పాటుకు జిల్లా కలెక్టర్లను ఆదేశించాలని, ఇందుకవసరమైన అధికారాలను ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ అధీనంలోని భూములను అర్హులకు పంచడంతో పా టు, ప్రభుత్వ భూములు పొంది సాగు చేసుకుంటున్న పేదరైతులకు ఆయా భూములకు పట్టాలు ఇవ్వాలని కోరారు.