
కృష్ణా, గోదావరిపై కొత్త ప్రాజెక్టులు: కేసీఆర్
హైదరాబాద్ : కృష్ణా, గోదావరి నదులపై కొత్తగా నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మిస్తామని తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. వ్యవసాయరంగం, వర్షాభావ పరిస్థితులపై ఉన్నతాధికారులతో కేసీఆర్ మంగళవారం సమీక్ష జరిపారు. రాష్ట్రంలో వ్యవసాయరంగానికి పూర్వవైభవం తేవాల్సిన అవసరముందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో 70 శాతం మంది ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
కొత్తగా చేపట్టే ప్రాజెక్టులతో తెలంగాణ వ్యాప్తంగా సాగునీరు అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూరగాయల సాగు గణనీయంగా పెరగాల్సిన అవసరమందని ఈ సమీక్షలో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.