ఆధార్ నంబర్‌తో మ్యూచువల్ ఫండ్ యూనిట్ల క్రయ, విక్రయాలను జరిపే సౌల భ్యాన్ని ఫండ్ సంస్థలు కల్పించాయి.
న్యూఢిల్లీ: ఆధార్ నంబర్‌తో మ్యూచువల్ ఫండ్ యూనిట్ల క్రయ, విక్రయాలను జరిపే సౌల భ్యాన్ని ఫండ్ సంస్థలు కల్పించాయి. ఏ ఇన్వెస్టరైనా కేవైసీ(నో యువర్ క్లయింట్) వివరాలు లేకుండానే పాన్ కార్డ్, ఆధార్ నంబర్‌తో ఆన్‌లైన్‌లో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. అయితే ఈ విధానంలో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 మించకుండా మాత్రమే ఇన్వెస్ట్ చేయడానికి అనుమతిస్తారు. ఈ కొత్త విధానంలో ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్ క్రయ, విక్రయాలను సులభంగా, వేగంగా నిర్వహించవచ్చని ఇప్పటికే ఆధార్‌తో మ్యూచువల్ ఫండ్స్‌తో ఇన్వెస్ట్ చేసే సదుపాయాన్ని కల్పించిన క్వాంటమ్ ఎంఎఫ్ పేర్కొంది.