కేశవరెడ్డి విద్యా సంస్థలపై హైకోర్టులో పిటిషన్
Published Wed, Feb 15 2017 4:34 PM | Last Updated on Mon, Oct 1 2018 5:40 PM
హైదరాబాద్: ప్రభుత్వ విద్యా విధానాలకు వ్యతిరేకంగా కేశవరెడ్డి విద్యా సంస్థలు నడుస్తున్నాయంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు విద్యార్థి తల్లిదండ్రులు రిట్ పిటిషన్ వేశారు. కేశవరెడ్డి విద్యా సంస్థల్లో చదివే నర్సరీ విద్యార్థుల నుంచి మూడున్నర లక్షలు ఫీజుల రూపంలో వసూలు చేస్తున్నారని తెలిపారు. పదో తరగతి వరకు ఎలాంటి ఫీజులు తీసుకోమని చెప్పిన స్కూల్ యాజమాన్యం ఆ డబ్బుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటోందని ఆరోపించారు. కాబట్టి, వారి ఆస్తులను జప్తు చేసుకుని, వచ్చే విద్యా సంవత్సరం నాటికి అందులో అడ్మిషన్లను రద్దు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేయాలని కోరారు.
Advertisement
Advertisement