రాజధాని శివారు సూరారంలోని మల్లారెడ్డి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో దుండిగల్ పోలీసులు తనిఖీలు చేశారు.
రాజధాని శివారు సూరారంలోని మల్లారెడ్డి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో దుండిగల్ పోలీసులు తనిఖీలు చేశారు. పలు కీలక రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. పేట్ బషీరాబాద్ ఏసీపీ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు.
నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న ఇంజనీరింగ్ కాలేజీలపై జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. మల్లారెడ్డి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో స్వాధీన పరుచుకున్న రికార్డులను పరిశీలించి, దాన్ని బట్టి అవసరమైతే తగిన చర్యలు తీసుకుంటామన్నారు.