పవర్ టచ్
అందమైన ఇల్లు.. రంగురంగుల గోడలు.. ఆకర్షణీయమైన వాల్‌ఫ్రేమ్‌లు.. అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్.. అంతా కొత్తదనం.. ఒక్కమాటలో చెప్పాలంటే గృహమే కదా స్వర్గసీమ! అందులో అక్కడక్కడా పాత ఎలక్ట్రిక్ స్విచ్‌బోర్డులు ఉన్నాయా.. వాటిపట్ల మీకు బోర్ కొట్టిందా.. అయితే పాతదనాన్ని ‘స్విచ్’ ఆఫ్ చేసి నూతనత్వాన్ని ‘టచ్’ చేయండి. అదేనండి..! టచ్ ఫీచర్ కలిగిన సెల్‌ఫోన్, డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్, ఐ-పాడ్, టాబ్లెట్‌ల కోవలోకి స్విచ్ బోర్డ్‌లు కూడా త్వరలో రానున్నాయి. హైదరాబాద్‌కు చెందిన హిడెన్ వ్యూ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయే టచ్ ఫెసిలిటీ కలిగిన స్విచ్ బోర్డులను రూపొందిస్తోంది.
నెలరోజుల్లో నగర మార్కెట్లో ఈ నయా బోర్డులు హల్‌చల్ చేయనున్నాయి. టెక్నాలజీలో భాగ్యనగరం దూసుకెళ్తుందనడానికి ఇది నిదర్శనం. ఏడెనిమిది స్విచ్‌లు కలిగిన ప్యానల్ బోర్డు రూ. 2 వేలల్లో లభిస్తుంది. దీనికి లైఫ్ టైమ్ వారంటీ ఉంటుంది. బోర్డ్ సైజును బట్టి ఎల్‌ఈడీ బ్యాక్ లైట్ విధానంలో ఇండికేషన్‌లు ఏర్పాటు చేస్తారు. ఈజీ ఇన్ స్టలేషన్, నాన్ బ్రేకబుల్, ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. పారదర్శకంగా ఉండే ఈ ప్యానల్‌లో నచ్చిన ఫొటో కూడా ఇన్‌సర్ట్ చేసుకునే సౌలభ్యం ఉంది. తడి చేతులతో తాకినా షాక్ కొట్టదు. నచ్చిన ఆకారంలో ప్యానెల్‌ను మలచుతారు. ఫ్యాన్ స్పీడ్ కంట్రోలర్, ఫైర్, థెఫ్ట్ అలారం సిస్టమ్ ఉంటుంది.
అందుబాటులో..
హై సెన్సిటివ్ టచ్ టెక్నాలజీని ఉపయోగించి టచ్ స్విచ్ బోర్డ్‌లను తయారు చేశాం. బయటి దేశాలు అందించేవి చాలా ఖరీదు. సామాన్యుడి దరికి చేర్చాలన్న ఉద్దేశంతో తక్కువ ధరకే మేం నాణ్యమైన టచ్ బోర్డ్‌లను అందజేస్తాం. వీటిని ఇన్నోవేటివ్ ఎక్స్‌పోలో ప్రదర్శించాం. అనూహ్య స్పందన వచ్చింది.
- టి.సంతోష్, ఎండీ,
హిడెన్ వ్యూ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్
- మహి
ఫొటోలు: రాజేష్