సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పోలీసులు తనిఖీలు | RPF police checking in secunderabad railway station | Sakshi
Sakshi News home page

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పోలీసులు తనిఖీలు

Published Wed, Apr 8 2015 8:55 AM | Last Updated on Sun, Sep 3 2017 12:02 AM

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పోలీసులు తనిఖీలు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పోలీసులు తనిఖీలు

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్ పోలీసులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని స్టేషన్కు తరలించి... విచారిస్తున్నారు. ఉదయం 7.00 గంటలకు ప్రారంభమైన ఈ తనిఖీలు రాత్రి వరకు కొనసాగుతాయని సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ ఎస్ జే జనార్దన్ వెల్లడించారు. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దాదాపు 200 మంది పోలీసు సిబ్బంది ఈ తనిఖీలలో పాల్గొన్నారు.

వరంగల్ - హైదరాబాద్ జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన ఎన్కౌంటర్ సిమీ ఉగ్రవాది వికార్తోపాటు అతడి గ్యాంగ్లోని నలుగురు సభ్యులు హతమైన సంగతి తెలిసిందే. అంతకుముందు నల్గొండ జల్లాలో ఇద్దరు సిమీ ఉగ్రవాదులు ఎన్కౌంటర్లో మరణించారు. నల్గొండ జిల్లాలో ఇప్పటికే పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. జానకీపురం, అలేరు పరిసర ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు తమ తనిఖీలను ముమ్మరం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement