చర్లపల్లిలో రూ. 4 లక్షలు పట్టివేత
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో నగర శివారు ప్రాంతం చర్లపల్లిలో పోలీసులు శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా వాహనంలో అక్రమంగా తరలిస్తున్న రూ. 4 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. అందుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీస్ స్టేషన్కి తరలించి... విచారిస్తున్నారు. గ్రేటర్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నగరంలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టిన సంగతి తెలిసిందే.