భద్రమ్మా.. నీ పట్టుదలకు సలాం | Salam your perseverance bhadramma | Sakshi
Sakshi News home page

భద్రమ్మా.. నీ పట్టుదలకు సలాం

Published Mon, Sep 7 2015 12:19 AM | Last Updated on Wed, Aug 8 2018 6:12 PM

భద్రమ్మా.. నీ పట్టుదలకు సలాం - Sakshi

భద్రమ్మా.. నీ పట్టుదలకు సలాం

రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకోనున్న మహిళ

జగద్గిరిగుట్ట: నిరక్ష్యరాసురాలైన ఓ మహిళ ఇష్టపడి చదవడం రాయడం నేర్చుకుని అక్షరాస్యురాలిగా మారి ఈ నెల 8న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఢిల్లీలో ప్రశంసాపత్రం అందుకోనుంది.  భద్రమ్మ అనే మహిళ సాక్షర భారత్ కింద చదువు నేర్చుకుంది.

కుత్బుల్లాపూర్ మండలం బాచుపల్లి గ్రామం సాయినగర్‌కు  చెందిన భద్రమ్మ  కొన్ని సంవత్సరాలుగా సాక్షర భారత్ గ్రామ కోఆర్డినేటర్ అనురాధ  వద్ద శిక్షణ తీసుకుని చదువు నేర్చుకుంది. దీంతో రంగారెడ్డి జిల్లా అధికారులు కుత్బుల్లాపూర్ మండలం బాచుపల్లి నుంచి భద్రమ్మను ఎంపిక చేసి శనివారం ఢిల్లీకి తీసుకు వెళ్లారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఆగం పాండు, స్థానిక నాయకులు  భద్రమ్మను సన్మానించి ఢిల్లీకి పంపారు.
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement