కేబీఆర్ పార్క్లో స్మగ్లర్ల అరెస్ట్ | Sandalwood smugglers held at KBR Park | Sakshi
Sakshi News home page

కేబీఆర్ పార్క్లో స్మగ్లర్ల అరెస్ట్

Published Fri, Oct 17 2014 8:32 AM | Last Updated on Mon, Oct 22 2018 1:59 PM

కేబీఆర్ పార్క్లో స్మగ్లర్ల అరెస్ట్ - Sakshi

కేబీఆర్ పార్క్లో స్మగ్లర్ల అరెస్ట్

హైదరాబాద్: నగరంలోని కేబీఆర్ పార్క్లో ఐదుగురు గంధం స్మగ్లర్లు పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం...  గత రాత్రి కేబీఆర్ పార్క్లోని గంధం చెట్లను ఐదుగురు స్మగ్లర్ల నరికివేస్తుండగా... అక్కడే మఫ్టీలో ఉన్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో స్మగ్లర్లు పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు. పోలీసులు చాకుచక్యంగా వ్యవహారించి ఐదుగురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం స్మగ్లర్లను పోలీసు స్టేషన్కు తరలించి పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. గత కొంతకాలంగా కేబీఆర్ పార్క్లో గంధపు చెట్లు అపహరణకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్క్ సిబ్బంది బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  దాంతో పోలీసులు మఫ్టీలో విధులు నిర్వహిస్తున్నారు.  ఆ క్రమంలో గురువారం రాత్రి ఐదుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. కేబీఆర్ పార్క్లో దాదాపు 200 గంధపు చెట్లు ఉన్న సంగతి తెలిసిందే.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement