సింగపూర్‌లో ఉన్నట్టుంది
‘1980లో హైదరాబాద్ చిన్న పట్టణంలా అనిపించేది. ఇప్పుడు సింగపూర్ స్థాయికి ఎదిగిందేమో అనిపిస్తుంది. తెలుగు సినీ పరిశ్రమ మొత్తం చెన్నైలో స్థిరపడటంతో హైదరాబాద్‌కు చుట్టపుచూపుగా వచ్చేవాడిని. అప్పట్లో ఇన్ని కార్లు, బిల్డింగ్స్ లేవు. ఏదైనా షూటింగ్ పనిమీద వస్తే ఏ లాడ్జిలోనో దిగేవాళ్లం. రెండేళ్ల క్రితం నుంచి పూర్తిగా సిటీలోనే ఉంటున్నాను.
హైటెక్ సిటీ, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ వైపు వెళ్లినప్పుడు ఫారిన్‌లో ఉన్నట్టు అనిపిస్తుంది. అభివృద్ధిలో అందనంత దూరం నగరం ఎదిగిపోయింది. హైదరాబాద్‌ను చూస్తుంటే గర్వంగా అనిపిస్తుంది. ఎంత అభివృద్ధి చెందినా.. కాంక్రీట్ జంగిల్‌గా అనిపిస్తోంది. అక్కినేని నాగేశ్వరరావు గారు ధైర్యం చేసి చె న్నై నుంచి హైదరాబాద్ రావడంతో పరిశ్రమ మొత్తం షిఫ్ట్ అయ్యింది. అప్పట్లో సారధి స్టూడియో ఒక్కటే ఉండేది. ఇప్పుడు హైదరాబాద్‌లోనే ప్రపంచస్థాయి టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఇక్కడి వంటకాలంటే చాలా ఇష్టం. ఈ నగరంలో ఎంతోమంది స్నేహితులు దొరికారు. జీవితంలో ఎక్కువభాగం చెన్నైలోనే గడిపినా ఇప్పుడు హైదరాబాద్ పై మమకారం పెరిగింది.’
- కె. విశ్వనాథ్, ప్రముఖ చిత్ర దర్శకుడు