హైదరాబాద్‌తో మీ జ్ఞాపకం.. రాసి పంపండి
చిన్నప్పుడు అమ్మానాన్నలతో కలసి హైదరాబాద్ వచ్చినపుడు సిటీలోకి బస్సు ఎంట్రీ అయినప్పటి నుంచి ముఖం కిటికీలోకి చేరిపోతుంది. ఇంటర్‌లో కార్పొరేట్ కాలేజ్‌లో చేరడానికి సిటీకి వచ్చిన కుర్రాడి మనసు సిటీతో ఫస్ట్ క్రష్‌లో పడుతుంది. దేవీ, సంధ్య, శాంతి.. వంటి వెండితెరలు రారమ్మంటుంటే కాదనలేక అప్పుడప్పుడూ వెళ్లొస్తుంటాడు. నూనుగు మీసాల నూత్న యవ్వనంలో.. సిటీలోకి అడుగుపెట్టిన డిగ్రీ విద్యార్థికి ఈ పట్నం కంచెలు తెంచేసే కల్పతరువు. ఇరానీ చాయ్.. దానికి మరింత కిక్ ఇచ్చే సిగరెట్టు.. మనోడి మజాను రెట్టింపు చేస్తాయి. నిరుద్యోగికి ఉద్యోగ భాగ్యం కల్పిస్తుంది.. చిరు వ్యాపారిని బడా పారిశ్రామికవేత్తని చే స్తుంది.. అంతా సిటీ మహిమ. ఈ పట్నానికి ఎవరొచ్చినా వారిని ఆదరించి.. వారిచేతనే ‘హమారా హైదరాబాద్’ అనేలా చేస్తుంది. ఎక్కడి నుంచో వచ్చి.. హైదరాబాదీగా మారిన ప్రతి ఒక్కరికీ.. సిటీతో ఆనాటి జ్ఞాపకాలు మాత్రం ఎప్పుడూ కొత్తగా ఉంటాయి.
కాలం మారినా చెదరని ఆ జ్ఞాపకాలను మాతో పంచుకోండి. చార్మినార్ చుట్టూ వేసిన రౌండ్లు.. ట్యాంక్‌బండ్ పై తచ్చాడటాలు.. ఇరానీ చాయ్ టేస్ట్.. గప్‌చుప్ కబుర్లు.. ఇలా మీకు సిటీతో ముడిపడి ఉన్న సంగతులు సిటీవాసులతో పంచుకోండి. హైదరాబాద్ తొలిసారి వచ్చినప్పుడు మీ అనుభవం, వచ్చిన కొత్తల్లో ఎదురైన సరదా సంఘటనలు.. మరచిపోలేని గుర్తులు.. మాకు పంపించండి. ఆ జ్ఞాపకంతో మీరు దిగిన ఫొటో లేదా.. మీ పాస్‌పోర్ట్ ఫొటోను కూడా జతచేయండి. మెయిల్ టు.. sakshicityplus@gmail.com