'వెంకయ్య ఒప్పుకోవడం సంతోషం' | Suravaram sudhakar reddy and Chada venkat reddy takes on bjp and trs | Sakshi
Sakshi News home page

'వెంకయ్య ఒప్పుకోవడం సంతోషం'

Published Fri, Dec 4 2015 1:17 PM | Last Updated on Fri, Mar 29 2019 9:12 PM

'వెంకయ్య ఒప్పుకోవడం సంతోషం' - Sakshi

'వెంకయ్య ఒప్పుకోవడం సంతోషం'

హైదరాబాద్ : దేశంలో స్పష్టమైన విదేశీ విధానం కరువైందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్లో  ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి  చాడ వెంకట్రెడ్డితో కలసి సుధాకర్రెడ్డి మాట్లాడారు. దేశంలో కొంచెం అసహనముందని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య నాయుడు ఒప్పుకోవడం సంతోషమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం మతాల పండగలు చేయడం అనవసరమని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు.

ఆయుత చండీ యాగం ప్రభుత్వానిదా లేక సొంతంగా చేసుకుంటున్నారో ప్రకటించాలని సీఎం కేసీఆర్ ని సుధాకర్రెడ్డి డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పువ్వాడ నాగేశ్వరరావు శనివారం నామినేషన్ దాఖలు చేస్తారని ఈ సందర్భంగా చాడ వెంకట్రెడ్డి చెప్పారు. అధికార టీఆర్ఎస్ పార్టీ... వలసలను ప్రోత్సహించడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement