తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు: రేవంత్
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ పంతం నెగ్గడానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని టీడీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ సొమ్ముతో మహారాష్ట్రకు నీళ్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఎన్టీఆర్ భవన్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ప్రాణహిత నుంచి రంగారెడ్డి జిల్లాను ఎందుకు తప్పించారని, రంగారె డ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలకు గోదావరి జలాలు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు.
ఛనాఖా-కొరట బ్యారేజీ నిర్మాణం ఖర్చును తెలంగాణ భరిస్తే, 20 శాతం నీళ్లను మహారాష్ట్రకు ఎందుకు ఇస్తున్నారన్నారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంలో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు పాత్ర ఉందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మహారాష్ట్రతో జరిగిన ఒప్పందంలో లొసుగులను గురువారం బహిర్గతం చేస్తామని తెలిపారు.