ఉగాది రోజున టెన్త్ పరీక్ష తేదీని మారుస్తాం | Tenth exam date change on the day of Ugadi | Sakshi
Sakshi News home page

ఉగాది రోజున టెన్త్ పరీక్ష తేదీని మారుస్తాం

Published Thu, Dec 1 2016 1:08 AM | Last Updated on Mon, Sep 4 2017 9:32 PM

Tenth exam date change on the day of Ugadi

సాక్షి కథనంపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి కడియం

 సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ సాధారణ సెలవుల ప్రకటన కంటే ముందుగానే పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూలు ఖరారు చేసిన నేపథ్యంలో 2017 మార్చి 29న ఉగాది నాడు పదో తరగతి సోషల్ పేపరు-1 పరీక్ష వచ్చిందని, ఆ తేదీని మార్పు చేస్తామని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు.

‘ఉగాది రోజున టెన్త్ సోషల్ పరీక్ష’ శీర్షికన బుధవారం సాక్షిలో కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం జరిగిన డీఈవోల సదస్సులో కడియం శ్రీహరి ఈ అంశంపై స్పందించారు. 2017 మార్చి 30వ తేదీతో పదో తరగతి పరీక్షలు పూర్తయ్యేలా ఉన్న షెడ్యూలును 31వ తేదీతో పూర్తయ్యేలా మార్పు చేస్తామన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement