'ఆ వార్తతో నాకు సంబంధం లేదు' | that story is not related to me, says musurareddy | Sakshi
Sakshi News home page

'ఆ వార్తతో నాకు సంబంధం లేదు'

Published Tue, Nov 10 2015 6:32 PM | Last Updated on Sat, Jul 6 2019 1:10 PM

ఆంగ్ల దినపత్రిక 'మెట్రో ఇండియా డైలీ టుడే'లో వచ్చిన 'now, stir for seema statehood' అనే కథనానికి తనకు ఏమాత్రం సంబంధం లేదని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఎంవీ మైసురారెడ్డి స్పష్టంచేశారు.

హైదరాబాద్ : ఆంగ్ల దినపత్రిక 'మెట్రో ఇండియా డైలీ టుడే'లో వచ్చిన 'now, stir for seema statehood' అనే కథనానికి తనకు ఏమాత్రం సంబంధం లేదని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఎంవీ మైసురారెడ్డి స్పష్టంచేశారు. తనను సంప్రదించి ఆ పత్రికలో వార్త ప్రచురితమైనట్లుగా వచ్చిన కథనంపై ఆయన తీవ్రంగా స్పందించారు. సీమ భవితవ్యం, రాష్ట్ర ఏర్పాటుపై తాను ఆందోళన చెందుతున్నట్లు అందులో వచ్చిన వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. తనను ఎవరూ ఇంటర్వ్యూ చేయలేదని, ఆ కథనంపై తాను ఆశ్చర్యానికి లోనైనట్లు ఆయన చెప్పారు. ఆ కథనాన్ని ప్రచురించినందుకు తనను క్షమాపణ కోరాలని మైసురా పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement