ప్రమాదవశాత్తు స్విమ్మింగ్‌పూల్‌లో పడిన బాలుడు నీట మునిగి మృతిచెందాడు.
ప్రమాదవశాత్తు స్విమ్మింగ్‌పూల్‌లో పడిన బాలుడు నీట మునిగి మృతిచెందాడు. ఈ సంఘటన నగరంలోని పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎర్రకుంటలో మంగళవారం చోటుచేసుకుంది. ఆసిఫ్‌నగర్‌కు చెందిన మొహమ్మద్ షోయబ్(14) అనే బాలుడు ఈత కొలనులో పడి మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.