బాధ్యుల్లేరు.. భారం ఉంది..
- పోలీస్‌శాఖలో కీలక విభాగాలకు అధిపతులేరీ?
- పదోన్నతులకూ అవకాశం ఇవ్వని ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: ఐపీఎస్‌ల పదోన్నతులు, పోస్టింగ్స్‌పై ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టత ఇవ్వకపోవడంతో కీలక విభాగాల పనితీరు గాడి తప్పేలా కనిపిస్తోంది. ఇన్‌చార్జీ లతో నెట్టుకొస్తున్న విభాగాలు అయోమయంలో పడిపో యాయి. దీంతో అదనపు డీజీపీల నుంచి ఎస్పీల వరకు పనిభారం పెరిగిపోయింది. రెండు జోన్లకు ఒకే ఐజీ, 4 రేంజ్‌లకు ఇద్దరు డీఐజీలే ఉన్నారు. సీఐడీకి చీఫ్‌గా ఉండే అదనపు డీజీ పోస్టు ఖాళీగా ఉంది. సీఐడీలో ఆరుగురు ఎస్పీలకు గానూ ఒక ఎస్పీ మాత్రమే ఉన్నారు. నలుగురు డీఐజీలు ఉండాల్సింది ఒక డీఐజీతో నెట్టుకొస్తున్నారు. ఏసీబీకీ చీఫ్ హోదాలో కూడా ఇన్‌చార్జీల పాలనే సాగుతోంది. ఏసీబీలో జాయింట్ డైరెక్టర్లుగా 4 పోస్టులంటే ఇద్దరే సర్వీసుల్లో ఉన్న అధికారులు న్నారు. మిగతా ఇద్దరు కాంట్రాక్ట్ పద్ధతిలో కొనసాగుతున్నారు.
విజిలెన్స్‌లోనూ ఇన్‌చార్జీ డైరెక్టర్ పాలన కొనసాగు తోంది. డీఎస్పీ నుంచి నాన్ క్యాడర్ ఎస్పీ హోదా వరకు ఉన్న 41 మంది అధికారులు ఈ ఏడాది పదవీ విరమణ చేయనున్నారు. అసలే కొరతతో ఇబ్బంది పడుతుంటే ఈ పదవీ విరమణలతో మరింత డీలా పడనుందని ఆందోళన మొదలైంది. రాష్ట్ర విభజనలో భాగంగా 12 నాన్‌క్యాడర్ ఎస్పీ, 24 వరకు అదనపు ఎస్పీ పోస్టులు వచ్చాయి. వీటితోపాటు కొత్తగా మంజూరయ్యే పోస్టులకు పదోన్నతి ఇవ్వాలని ఉన్నతాధికారులు నిర్ణయిం చారు. ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టడంతో ఆశావహుల్లో అసంతృప్తి నెలకొంది.