వచ్చే అసెంబ్లీలో రెండే పార్టీలుంటాయి | There will be two parties in next Assembly | Sakshi
Sakshi News home page

వచ్చే అసెంబ్లీలో రెండే పార్టీలుంటాయి

Published Tue, Mar 29 2016 12:41 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

వచ్చే అసెంబ్లీలో రెండే పార్టీలుంటాయి - Sakshi

వచ్చే అసెంబ్లీలో రెండే పార్టీలుంటాయి

సాక్షి, హైదరాబాద్: వచ్చే శాసన సభలో కేవలం రెండు పార్టీలు మాత్రమే ఉంటాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి జోస్యం చెప్పారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్‌లోని ఏడెనిమిది స్థానాలు మినహాయిస్తే మిగిలిన అన్ని స్థానాలనూ ఒకే పార్టీ గెలుచుకుంటుందని, అది తామేనని పేర్కొన్నారు. సోమవారం అసెంబ్లీ లాబీల్లో విలేకరులతో ఆయన ముచ్చటించారు.

2018 లోనే సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు పోతారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన వద్ద ప్రస్తావించగా.. ‘2018 నుంచి చెట్టూ.. పుట్టా.. ఊరూ.. వాడా తిరుగుతానని అన్న ప్రకటిస్తడు.. తమ్ముడేమో 2018 లోనే ఎన్నికలు అంటడు.. వారిది పిచ్చివాళ్ల స్వర్గం’ అని మంత్రి జగదీశ్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement