హైదరాబాద్: ఇఫ్లూ ప్రొఫెసర్ మొహంతి రజాక్‌కు జైలు శిక్ష పడింది. లైంగిక వేధింపుల కేసులో నిందితుడైన ఆయనకు మూడేళ్లు జైలు శిక్ష విధిస్తూ నాపంల్లి మహిళా కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. కొంతకాలం కిందట మొహంతిపై లైంగిక వేధింపుల ఆరోపణలు నమోదయ్యాయి. దీనిపై కొన్ని దఫాలుగా విచారణ చేపట్టిన కోర్టు చివరికి ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.