మియాపూర్ భూ కుంభకోణం నేపథ్యంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో బదిలీల పర్వం కొనసాగుతోంది.
హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల అధికారులను ఇతర జిల్లాలకు, ఇంతకాలం నాన్ ఫోకల్ ప్రాంతాల్లో పని చేసిన వారిని హైదరాబాద్‌కు బదిలీ చేశారు. ఈ మేరకు రెవెన్యూ (రిజిస్ట్రేషన్ల) శాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రక్షాళనలో భాగంగా రాష్ట్రంలోని 141 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో 72 చోట్ల అధికారులను మార్చినట్లు సీఎం కార్యాలయం ప్రకటించింది.