
నేడు గ్రూప్స్ సిలబస్ ప్రకటన
సాక్షి, హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్న గ్రూప్స్ పరీక్షల సిలబస్‌ను సోమవారం సాయంత్రం 4 గంటలకు కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి విడుదల చేయనున్నారు. ఇందుకు టీఎస్‌పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సిలబస్ విడుదల చేసిన వెంటనే వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకురానుంది. సోమవారం వీలు కాకపోతే మంగళవారం ఉదయం విద్యార్థులు చూసుకునేలా చర్యలు చేపట్టింది.