తాము అవినీతికి పాల్పడితే నడి బజారులో కాల్చివేయాలని రోడ్డు భవనాల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
కమ్మర్‌పల్లి: తాము అవినీతికి పాల్పడితే నడి బజారులో కాల్చివేయాలని రోడ్డు భవనాల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ప్రజలకు సేవ చేయడానికి ఉన్నాం తప్ప అన్యాయం చేయడానికి కాదన్నారు. సోమవారం నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లిలో రూ.2.8 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే కమ్మర్‌పల్లి భీమ్‌గల్ రోడ్డు రెన్యూవల్ పనులు, భీమ్‌గల్‌తో పాటు బడాభీమ్‌గల్‌లో రూ.30కోట్లతో పలు రోడ్ల విస్తరణ పనులకు మిషన్ భగీరథ ప్రాజెక్ట్ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డితో కలసి ఆయన శంకుస్థాపన చేశారు. మంత్రి మాట్లాడుతూ అధికారం కోసమే ప్రతిపక్షాలు ప్రభుత్వ పాలనపై ఏడుస్తున్నాయన్నారు. రాష్ట్రంలో వానలు పడినా, చెరువులు నిండినా, ప్రతిపక్షాలకు ఏడ్పుగోలే ఉందన్నారు.