మంటల్లో డెనిమ్ షోరూమ్
సుల్తాన్‌బజార్: నగరంలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఒకే రోజు రెండు రెడీమేడ్ దుస్తుల దుకాణాల్లో అగ్నిప్రమాదాలు సంభవించడంతో రూ. లక్షల్లో ఆస్తినష్టం వాటిల్లింది. సుల్తాన్ బజార్, బోయిన్ పల్లిలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో దుకాణాలకు నిప్పంటుకుని దసరా పండుగకు తీసుకువచ్చిన రెడీమేడ్ వస్త్రాలు అగ్నికి అహుతయ్యాయి. వివరాల్లోకి వెళితే..ముసారాంబాగ్‌కు చెందిన ప్రవీణ్‌కుమార్ సుల్తాన్ బజార్ జైన్‌మందిర్ సమీపంలో న్యూ స్వప్న ట్రేడర్స్ పేరుతో రెడీమేడ్ దుఖానం నిర్వహిస్తున్నాడు. సోమవారం రాత్రి దుకాణానికి తాళాలు వేసి ఇంటికి వెళ్లిన ప్రవీణ్‌కుమార్‌కు తెల్లవారుజామున షాపునకు నిప్పంటుకున్నట్లు స్థానికులు ఫోన్‌ద్వారా సమాచారం అందించారు. దీంతో అతను హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. సుల్తాన్ బజార్ పోలీసుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ దసరా పండుగ నేపథ్యంలో రూ. 1.5 కోట్ల స్టాక్ తెచ్చామని, సుమారు రూ. 60 లక్షల నుంచి రూ. 70 లక్షలు ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలిపాడు. సుల్తాన్ బజార్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు
బోయిన్‌పల్లి ‘డెనిమ్’ షోరూమ్‌లో..
కంటోన్మెంట్: బోయిన్‌పల్లి ఫిలిప్స్ గోడౌన్ బ్రిడ్జి సమీపంలోని ఓ బట్టల దుకాణంలో మంగళవారం ఉదయం మంటలు చెలరేగి భారీ ఆస్తినష్టం వాటిల్లింది. వివరాల్లోకి వెళితే ప్రముఖ వస్త్రవ్యాపార సంస్థ ‘డెనిమ్’ బోయిన్‌పల్లి ప్రాంతంలో సంస్థ ప్రధాన కార్యాలయంతో పా టు కింది అంతస్తులో షోరూం నిర్వహిస్తోంది. మంగళవారం తెల్లవారుజామున దుకాణానికి నిపకపంటుకోవడంతో దుస్తులు కాలిబూడిదయ్యాయి, పై అంతస్తులోని కార్యాయంలో ఫర్నిచర్, ఫైళ్లు దగ్దమైనట్లు సమాచారం.
షార్ట్‌సర్యూటే కారణమా?
డెనిమ్ షోరూములో అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని భావిస్తున్నా పూర్తి వివరాలు తెలియరాలేదు. ఫిలిప్స్ బ్రిడ్జి సమీపంలోని ఈ భవనం మీదుగా విద్యుత్ హైటెన్షన్ లైన్లు వెళ్తున్నాయి. ఇటవల బ్రిడ్జి విస్తరణ పనుల్లో భాగంగా పాత వంతెన కూల్చేసి విద్యుత్, మంచినీటి పైపులైన్ల తరలింపు పనులు చేపట్టడంతో షాపు ముందు వైర్లు బయటికి కనిపిస్తున్నాయి. మంగళవారం ఉదయం వర్షం కురియడంతో షార్ట్‌ర్క్యూట్ సంభవించి మంటలు చెలరేగి ఉండవచ్చునని అంచనా.