కాగితాలు, వస్త్రాలపై తయారుచేసిన మూడు రంగుల జెండాను మాత్రమే జాతీయ దినోత్సవాలు, క్రీడలు, ఇతర సాంస్కృతిక ఉత్సవాలకు ఉపయోగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
సాక్షి, హైదరాబాద్: కాగితాలు, వస్త్రాలపై తయారుచేసిన మూడు రంగుల జెండాను మాత్రమే జాతీయ దినోత్సవాలు, క్రీడలు, ఇతర సాంస్కృతిక ఉత్సవాలకు ఉపయోగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ప్లాస్టిక్ జెండాలు వాడరాదని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి (రాజకీయ) అజయ్‌మిశ్రా జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల అధిపతులకు గురువారం ఆదేశాలు ఇచ్చారు.
త్రివర్ణ పతాకాలను అలంకరణలకు ఉపయోగించరాదని, ముఖ్యమైన జాతీయ దినాలు, క్రీడలు, సాంస్కృతిక ఉత్సవాల్లో దాన్ని ఊపవచ్చన్నారు. జెండా ఆవిష్కరణలు నిబంధనలకు అనుగుణంగా జరుగుతున్నాయో.. లేదో పరిశీలించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. జెండాను అగౌరవపరిస్తే నేరంగా పరిగణిస్తామన్నారు.