సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లను జనాభా ప్రాతిపదికన పెంచా లని, బీసీ సబ్‌ప్లాన్ అమలు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. సబ్‌ప్లాన్ అమలు కోసం క్షేత్రస్థాయి పోరాటాలకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు. గాంధీభవన్‌లో ఓబీసీ సెల్ చైర్మన్ చిత్తరంజన్‌దాస్ అధ్యక్షతన గురు వారం బీసీల సమావేశం జరిగింది.
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్న సమావేశంలో ఉత్తమ్ మాట్లాడుతూ... ఎన్నికల ముందు టీఆర్‌ఎస్ బీసీలకు ఇచ్చిన హామీల అమలు కోసం పోరాటాలు చేయాలన్నారు. బీసీలు అందరిని ఒక్కతాటిపైకి తేవాలని పిలుపుని చ్చారు. సెప్టెంబరు 30 నాటికి గ్రామాల్లో కమిటీలు నియమించి, సభ ఏర్పాటుచే యాలన్నారు. సామాజిక న్యాయం ఒక్క కాంగ్రెస్‌లోనే సాధ్యమని, 3 నెలల్లో గ్రామ స్థాయి వరకు కమిటీలు పూర్తి చేయాలని విక్రమార్క సూచించారు. పార్టీ నాయకులు మల్లు రవి, మహేశ్‌కుమార్‌గౌడ్, నెరేళ్ల శారద, సురేశ్ షెట్కార్‌తో పాటు జిల్లాల నాయకులు పాల్గొన్నారు.