♦ మహా నగరంలో నీటి కష్టాలు
♦ ఓ వైపు లీకేజీలు... మరోవైపు జల దోపిడీ
♦ వృథాను అరికట్టడంలో యంత్రాంగం వైఫల్యం
మహా నగరం నీటి జాడ తెలియక తల్లడిల్లుతోంది. దశాబ్దాలుగా దాహంతో అల్లాడుతోంది. ఎండలు ముదురుతున్నాయంటే భయంతో వణికిపోతోంది. భూగర్భ జలాలు అడుగంటి... హైదరాబాద్ నీటి కష్టాలకు రాజధానిగా మారుతోంది. దాహం తీరే దారి తెలియక బిక్కుబిక్కుమని చూస్తోంది. నిప్పులు చెరిగే ఎండలో... కుటుంబం యావత్తూ పనులు మానుకొని... నల్లాల దగ్గర బిందెలు పట్టుకొని.. గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ఎప్పుడో ఒకసారి వచ్చే ట్యాంకర్ల దగ్గర...యుద్ధాలు షరా మామూలే. బస్తీల్లోనైతే బిందెల సమరమే. బలం ఉన్న వారిదే నీరు. ఒక్క బిందె నీరు దొరికితే ప్రపంచం గెలిచిన సంబరం.లేదంటే కి లోమీటర్లకొద్దీ ప్రయాణం. నాణేనికి మరోవైపు పైపు లైన్ల లీకేజీలు... మోటార్లతో సంపులు.. ట్యాంకులు నింపుకుని సొమ్ము చేసుకోవాలనేఅక్రమార్కుల నీటి దోపిడీ... నగర వాసుల నీటి కష్టాలను పెంచుతున్నాయి. కుటుంబంలో ఒక్కరు కష్టపడితే అందరి కడుపులూ నిండుతున్నాయ్... కానీ అందరూ కొళాయిల దగ్గర నిలబడకపోతే దాహం మాత్రం తీరడం లేదు. విశ్వనగరం నీటికష్టాలపై ‘సాక్షి’ ఫోకస్...
విశ్వ నగరం గొంతెండుతోంది. ఏళ్ల తరబడి తాగునీటి సవుస్యతో నగరం అల్లాడుతోంది. అయినా... పట్టించుకునే నాథుడే లేరు. ఒక వైపు లీకేజీలు..వురో వైపు అక్రవూర్కుల నీటి దోపిడీ .. అరికట్టడంలో అధికార యుంత్రాంగం వైఫల్యం నీటి సమస్యను తీవ్రం చేస్తోంది. శివారు ప్రాంతాల్లోని కాలనీలు, బస్తీల్లో పరిస్థితి వురీ దారుణం. చిన్నా..పెద్దా అంద రూ నీటి కోసం పరుగులు తీస్తున్నారు. ఎన్నాళ్లీ నీటి కష్టాలు?...ఇవి కడతేరేదెప్పుడు? అందరిలోనూ ఇదే ప్రశ్న. ప్రభుత్వ పెద్దలు.. ఉన్నతాధికారులు ఉండే రాజధానిలో పానీ పరేషాన్‌పై ‘సాక్షి’ ఫోకస్.
మహా నగరానికి జలమండలి రోజువారీగా తరలిస్తున్న 340 మిలియన్ గ్యాలన్ల నీటిలో సరఫరా,పంపిణీ నష్టాలు సుమారు 40 శాతం మేర ఉంటోంది. ఫలితంగా సరఫరా 204 మిలియన్ గ్యాలన్లు మించడంలేదు. వృథా అవుతున్న నీటిని ఒడిసిపడితే శివారు వాసుల గొంతు తడపొచ్చన్న సృ్పహ జలమండలికి కరువవడంతో నీటి కటకట రోజురోజుకూ తీవ్రమవుతోంది. వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న నల్లగొండ జిల్లా కోదండాపూర్ నుంచి కృష్ణా మొదటి రెండవ దశల ద్వారా 180 ఎంజీడీలు,మెదక్ జిల్లాలోని సింగూరు, మంజీరా జలాశయాల నుంచి మరో 120 ఎంజీడీలు, నగరానికి ఆనుకొని ఉన్న హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ నుంచి మరో 40 ఎంజీడీల నీటిని జలమండలి సేకరిస్తోంది.
ఈ నీటిని శుద్ధిచేసి సరఫరా నష్టాలు పోను మిగిలిన జలాలను నగరంలోని 8.65 లక్షల నల్లాలకు జలమండలి అరకొరగానే సరఫరా చేస్తోంది. ఇక శివారు ప్రాంతాల్లో కొందరు నీటి జలగలు అక్రమంగా మోటార్ల ద్వారా నీటిని తోడి భారీ సంపులు, ట్యాంకులు నింపుకుంటున్నా బోర్డు విజిలెన్స్ విభాగం నిద్రమత్తులో జోగుతోంది. దీంతో ఎగువ ప్రాంతాలు, బస్తీ, కాలనీల్లో చివరి ప్రాంతాల్లో ఉన్నవారి గొంతెండుతోంది. లీకేజీలను అరికట్టేందుకు ఏటా వెచ్చిస్తున్న కోట్లాదిరూపాయల నిధులు నీళ్లపాలవుతుండడంతో పరిస్థితి విషమిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో స్టాటిక్ ట్యాంకులు నిరుపయోగంగా వూరారుు.
లీకేజీలు,కన్నీటి కష్టాలకు సాక్ష్యాలివే..
కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో మంచినీటి పైప్‌లైన్లు లీక్ అవుతున్నారుు. ఆగ్రోస్ కంపెనీ వద్ద, ఫాంతూష్, ఐడీపీఎల్ సూర్యానగర్, రాంరెడ్డినగర్, గాంధీనగర్ ఇండస్ట్రీయల్ కేఫ్ ఎదురుగా సంపు, ఎర్ర గోడల వద్ద 300 ఎంఎం పైపులైన్ సంపు, సుచిత్ర సమీపంలోని వెన్నెలగడ్డ, బ్యాంక్ కాలనీకి వెళ్లే రోడ్డు, గాజులరామారం చౌరస్తా.. ఇలా అనేక ప్రాంతాల్లో నీరు ఏరులై పారుతోంది.కూకట్‌పల్లి జగద్గిరిగుట్ట దీనబంధు కాలనీలో మంచినీటి పైపులైన్ వాల్వులు లీకై ప్రతిరోజూ నీరు వృథా అవుతోంది.
మరికొన్ని వీధుల్లో భూగర్భ డ్రైనేజీ నీళ్లు మంచినీటి పైపుల్లో చేరడంతో కలుషితమైన తాగునీరు సరఫరా అవుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆస్‌బెస్టాస్ కాలనీ, ఆల్విన్‌కాలనీ, పాపిరెడ్డినగర్, వెంకటేశ్వరనగర్, ఆదిత్యనగర్ తదితర ప్రాంతాలలో వారానికి ఒక మారు నీరు విడుదల చేయడంతో తాగడానికి నీటిని కొనుగోలు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు.మూసాపేటలోని పలు బస్తీలోకి మంచినీరు రాకపోవడంతో జనతానగర్‌లోని నీటి ట్యాంక్ వద్దకు వచ్చి లీకేజీ నీటితో స్థానికులు పట్టుకొని గొంతు తడుపుకుంటున్నారు.
నేరేడ్‌మెట్ డిఫెన్స్ కాలనీ డివిజన్ పరిధిలో మంచినీటి కటకటతో ప్రజలు తల్లడిల్లుతున్నారు. డివిజన్‌లోని కాకతీయనగర్, రేణుకానగర్, మధురానగర్, రామకృష్ణాపురం, జేకే కాలనీ, శ్రీసాయినగర్, వాజ్‌పేయినగర్, సైనిక్‌పురి, శివసాయినగర్ తదితర కాలనీల్లో పవర్‌బోర్లు చెడిపోవడంతో నీరు నిల్వ ఉంచుకునేందుకు ఏర్పాటు చేసిన స్టాటిక్ ట్యాంకులు నీరు లేక అలంకార ప్రాయంగా మారాయి.
షాపూర్‌నగర్‌లో వారానికి ఒక రోజు మాత్రమే ట్యాంకర్ నీళ్లు సరఫరా అవుతున్నాయి. ట్యాంకర్ కోసం డ్యూటీలు మానుకుని వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ట్యాంకర్ల వద్ద యుద్ధం చేయాల్సివస్తోంది.
పాతనగరంలోని జియాగూడకు ప్రతినిత్యం పానీ పరేషానే. ఓల్డ్ సిటీ మిశ్రీ గంజ్, రెడ్‌హిల్స్ ప్రాంతాల నుంచి తక్కువ వత్తిడితో నీటిసరఫరా జరుగుతోంది. ఓల్డ్ సిటీ వాటర్ అక్కడి ప్రజలకు సరిపోయిన తర్వాతే జియాగూడకు సరఫరా అవుతోంది. లేనిపక్షంలో నీటి సరఫరా నిలిచిపోతోంది. దీనికి తోడు మల్లేపల్లి, నాంపల్లి,మంగళ్‌హాట్ తదితర ప్రాంతాల్లో కొంతమంది మంచినీటి పైప్‌లైన్ల నుంచి మోటార్ల ద్వారా నీటిని తోడేస్తున్నారు.
ముషీరాబాద్ నియోజకవర్గం కవాడిగూడలో అక్రమ నీటి వ్యాపారం జోరుగా సాగుతోంది. అక్రమంగా బోర్లు వేసి నీటి దందా చేస్తుండడంతో నియోజక వర్గ పరిధిలో రోజు రోజుకూ భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. జల మండలి ద్వారా ఒక్కో నీటి ట్యాంకర్ రూ. 400 వరకు తీసుకుంటుండగా ప్రైవేట్ వ్యాపారులు ఒక్కో నీటి ట్యాంకర్‌కు 800 నుంచి 1200 వరకు వ్యాపారులు వసూలు చేస్తున్నారు.లోయర్ ట్యాంక్‌బండ్‌లోని ముషీరాబాద్ తహశీల్దార్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే నలువైపులా, కవాడిగూడలో అక్రమ నీటి వ్యాపారం సాగుతున్నా వీటిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
పాతబస్తీలో మంచినీటి సరఫరా అస్తవ్యస్తంగా కొనసాగుతోంది. పెద్ద ఎత్తున మోటార్లు పెట్టినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఒక్కో బస్తీలో మెజార్టీ ప్రజలు మోటార్ల ద్వారా నీటిని జలగల్లా తోడేస్తున్నారు. పాతబస్తీలోని శంషీర్‌గంజ్, మిశ్రీగంజ్, బాలాపూర్, మొఘల్‌పురా, సంతోష్‌నగర్ మంచినీటి రిజర్వాయర్ల పరిధిలో ఇదే పరిస్థితి నెలకొని ఉంది.
మొఘల్‌పురా నుంచి వాటర్ ట్యాంకర్ల నీటిని ప్రైవేట్‌గా విక్రయిస్తున్నారు. ఉప్పుగూడలోని పలు బస్తీలలో నీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో బస్తీల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సాయిబాబానగర్, శివాజీనగర్, రాజీవ్‌గాంధీనగర్, చాంద్రాయణగుట్ట, బండ్లగూడ, గౌస్‌నగర్‌లో సమస్య తీవ్రత జటిలంగా ఉంది.
ఎల్‌బీనగర్ నియోజకవర్గం పరిధిలోని కొత్తపేట, మన్సూరాబాద్, ఆర్‌కేపురం, హయత్ నగర్, వనస్థలిపురం, కర్మన్‌ఘాట్, చంపాపేట, చైతన్యపురి ప్రాంతాల్లో నీటి వ్యాపారం జోరుగా కొనసాగుతుంది. కొత్తపేట, కర్మన్‌ఘాట్, హయత్‌నగర్, మన్సూరాబాద్ డివిజన్లలో ప్రైవేటు బోర్ల నుంచి పెద్ద ట్యాంకర్ల నుంచి వందలాది లీటర్ల నీటిని అక్రమంగా తోడేస్తూ వ్యాపారం చేసుకుంటున్నారు.
ఎల్‌బీనగర్ సర్కిల్ పరిధిలో 40 శాతం కాలనీలు, బస్తీలు మంచినీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వచ్చే నీరంతా లీకేజీల ద్వారా వృథా కావడంతో కాలనీలకు సరిపడా నీరు అందడం లేదు. పాత పైపులైన్ల ద్వారా నీటిని సరఫరా చేయడంతో ఈ సమస్య తలెత్తుతోంది. పలు కాలనీలకు నీరు సరిపడా రాకపోవడంతో కాలనీవాసులు మోటార్లు బిగించుకుని నీటి చౌర్యానికి పాల్పడుతున్నారు.
నీటి డిమాండ్ ఇలా..
గ్రేటర్ వ్యాప్తంగా రోజువారీగా నీటి డిమాండ్: 459 మిలియన్ గ్యాలన్లు
గ్రేటర్‌లో రోజువారీగా జలమండలి
సరఫరా చేస్తున్న నీరు: 340 మిలియన్ గ్యాలన్లు
సరఫరా నష్టాలు 40 శాతం పోను
వాస్తవ సరఫరా: 204 మిలియన్ గ్యాలన్లు
గ్రేటర్ పరిధిలోని జలమండలి
నల్లా కనెక్షన్లు: సుమారు 8.75 లక్షలు
గ్రేటర్‌లో జలమండలి మంచినీటి పైప్‌లైన్ వ్యవస్థ లేని కాలనీలు,బస్తీలు: సుమారు 1000
నీటి వృథాకు కారణాలు: పైప్‌లైన్లు, వాల్వ్‌ల లీకేజీలు, నీటిచౌర్యం,మోటార్లతో నీటిని తోడడం, అక్రమ సంపులు, ట్యాంకుల్లో నీటిని నిల్వచేసుకోవడం.
కన్నీటి వ్యథా చిత్రం
Published Thu, Apr 9 2015 12:05 AM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM
Advertisement
Advertisement