'చిల్లర' దేవోభవ!
బ్యాంకులు, ఏటీఎంల వద్ద జనం పడిగాపులు
తెరిచిన కొద్ది గంటల్లోనే ఏటీఎంలు ఖాళీ
సాక్షి, హైదరాబాద్: పాత నోట్ల రద్దు, కొత్త నోట్లు తీసుకునే ప్రక్రియ జనానికి నరకం చూపుతూనే ఉంది. అవసరాలకు డబ్బుల్లేక ప్రజలంతా అవస్థలు పడుతున్నారు. నోట్లు మార్చుకునేందుకు బ్యాంకులు, పోస్టాఫీసుల కు వెళుతున్న వారు, డ్రా చేసుకొనేందుకు ఏటీ ఎంలకు వెళుతున్నవారికి గంటల కొద్దీ వేచి ఉండక తప్పడం లేదు. రోజులు గడుస్తున్న కొ ద్దీ చేతిలో ఉన్న డబ్బులూ అయిపోతుండడం తో నిత్యావసరలూ కొనుక్కోలేని పరిస్థితి. వైద్యం కోసం మందులూ కొనుగోలు చేయలేని దుస్థితి. కూలీలు, కార్మికుల పరిస్థితి మరింత దుర్భరంగా తయారైంది. డబ్బుల్లేక తిండికి తిప్పలు వచ్చిన దుస్థితి నెలకొంది. హైదరాబాద్‌లో ఏ మూలకు వెళ్లినా ప్రజల ‘నోటు’ కష్టాలు కళ్లకు కడుతున్నారుు. 3,4 గంటలు బ్యాంకులు, ఏటీఎంల వద్ద నిలుచున్నా పెద్ద సంఖ్యలో జనం డబ్బు చేతికి అంద కుండానే వెనుదిరుగుతున్నారు.
సికింద్రాబాద్, రాణిగంజ్, కోఠి, బేగంబజార్, ఉస్మాన్‌గంజ్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీనగర్, కూకట్‌పల్లి, ఈసీ ఐఎల్, ఉప్పల్‌సహా నగరంలోని అన్ని ప్రాంతా ల్లో జనాలు శనివారం ఉదయం 7 గంటల నుంచే బ్యాంకులు, పోస్టాఫీసులు, ఏటీఎంల వద్ద బారులు తీరారు. ఇవన్నీ పోలీసు బందో బస్తు నడుమ పనిచేశాయి. పలు చోట్ల తోపు లాటలు, గందరగోళం, తొక్కిసలాట చోటు చేసుకున్నారుు. బ్యాంకుల్లో రూ.2,000 కొత్త నోట్లను ఇచ్చినా.. వాటిని మార్చుకొనేందుకు ఎక్కడా చిల్లర దొరకడం లేదు. దీంతో మురి కివాడల్లో నివసించే ప్రజలు, అడ్డాకూలీలు, వేతన జీవులు, కార్మికులు ఇబ్బందులు పడు తున్నారు. ఇక బంగారం కొనుగోలుదారుల వివరాలు ఇవ్వాలన్న ప్రభుత్వ ఆదేశాల నేప థ్యంలో... పాత బస్తీ ప్రాంతంలో బంగారు ఆభరణాల కొనుగోళ్లు బాగా తగ్గిపోయాయి.
రెయిలింగ్ కూలి గాయాలు
పాత నోట్ల మార్పిడి, నగదు డ్రా చేసుకోవడం కోసం తిప్పలు పడుతున్న ప్రజలు చివరికి గాయాల పాలవుతున్నారు. తిండి తిప్పలు మా ని క్యూలలో నిలబడినవారు సృ్పహతప్పి పడిపోతున్నారు. శనివారం హైదరాబాద్‌లోని జూపార్కు వద్ద ఉన్న చందులాల్ బారాదరి ఎస్‌బీఐ బ్రాంచి వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు క్యూ కట్టారు. చా లా సేపటి నుంచి వేచి ఉండడంతో ఓ యువకుడు సృ్పహ తప్పిపడిపోయాడు. అతడిని బయటికి తీసుకువస్తున్న క్రమంలో తోపులాట జరిగి.. బ్యాంకు బయట ఉన్న రేరుు లింగ్ కూలిపోరుుం ది. దీంతో విధు లు నిర్వహిస్తున్న బహదూర్‌పురా అద నపు ఇన్‌స్పెక్టర్ గురునా యుడు సహా పలువురు కిందపడి గాయాల పాలయ్యారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని, సృ్పహ తప్పిన యువకు డిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇక సింగరేణి వాంబే గృహాలకు చెందిన రజని (50) సరస్వతి నగర్‌లోని ఎస్‌బీ హెచ్ వద్ద క్యూలైన్‌లో సృ్పహ తప్పి పడిపో యారు. అక్కడే విధుల్లో ఉన్న పో లీసులు ఆమెను గమనించి, ప్రథమ చికిత్స చేశారు.
రెండు రోజుల్లో జీహెచ్‌ఎంసీకి రూ.67 కోట్లు
పాతనోట్లతో పన్నులు చెల్లించేందుకు వెసులుబాటు కల్పించడంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీగా పన్నులు వసూలవుతున్నారుు. దీంతో జీహెచ్‌ఎంసీకి ఆస్తి పన్ను రూపేణా శుక్రవారం రికార్డు స్థారుులో రూ.55 కోట్లు ఆదాయం రాగా, శనివారం రూ.12 కోట్లు వచ్చారుు. రెండు రోజుల్లోనే రూ.67 కోట్లు సమకూరారుు. శుక్రవారం ఒక్కరోజే 30 వేల మంది ఆస్తి పన్ను చెల్లించారు. వారిలో 21వేల మంది రూ.10 వేలలోపు పన్ను చెల్లించగా.. 6,854 మంది రూ.10వేల నుండి రూ.50వేల వరకు, 1,193 మంది రూ.లక్ష వరకు, 655 మంది రూ.2 లక్షల వరకు, 288 మంది రూ.5లక్షల వరకు పన్ను చెల్లించారు. పాత 500, 1000 రూపాయల నోట్లతో పన్నులు చెల్లించడానికి సోమవారం రాత్రి వరకు గడువున్నందున ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. జీహెచ్‌ఎంసీ కార్యాలయాల్లోని అన్ని సిటిజన్ సర్వీస్ సెంటర్లు ఆది, సోమవారాల్లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేస్తాయని వెల్లడించారు.
అనాథ పిల్లలకు అన్నం ఎలా పెట్టాలి
‘పాత నోట్ల రద్దుతో తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నాం. పిల్లలకు జ్వరాలు వస్తున్నారుు. ఆసుపత్రికి తీసుకెళ్దామంటే చేతిలో డబ్బుల్లేవు. రెండు రోజుల నుంచి బ్యాంకుకు వస్తున్నా.. నోట్ల మార్పిడి కుదరడం లేదు. కూరగాయలు కొనేందుకు కూడా ఇబ్బందిగా ఉంది. నోట్ల మార్పిడిలో అనాథాశ్రమాలు, సహాయ కేంద్రాలకు ప్రాధాన్యతనివ్వాలి. నేరుగా కొంచెం ఎక్కువ మొత్తంలో సొమ్ము తీసుకునే వెసులుబాటు కల్పించాలి..’’
- వనజ, ఆశ్రయ్ హోమ్, లాలాపేట్
పంట అమ్ముకోలేం.. నిల్వ చేసుకోలేం..
‘నాకున్న ఐదెకరాల్లో పత్తి సాగు చేసిన. ఇందుకోసం ల క్షన్నర అప్పు చేసిన. 2 ఎకరా ల్లో పత్తి ఎదగలేదు. మిగిలిన మూడెకరాల్లో వచ్చిన పత్తిని అమ్ముదామనుకుంటే పాత నో ట్లు ఇస్తున్నరు. పత్తిని తీయకుండా ఉందామంటే మంచు పడి పాడైపోతది. తీసి ఇంట్లో ఉంచుదామంటే జాగా లేదు. ఇంకోదిక్కు అప్పుల మీద వడ్డీ పెరుగుతోంది. కొత్తనోట్లు ఎప్పుడు ఇస్తారో, పంట అమ్మేదెప్పుడో తెలియడం లేదు..’’
- బీమరాజుల రాజలింగు, రైతు, నెన్నెల, ఆదిలాబాద్
మందులు కొనేందుకు డబ్బుల్లేవు
‘పక్షవాతంతో బాధపడుతున్న మా నాన్నను ఆస్పత్రిలో చేర్పించాం. మందుల షాపుల్లో పాత నోట్లు తీసుకోలేదు. పాత నోట్లు మార్చుకునేందుకు ఉదయం నుంచి సాయంత్రం వరకు బ్యాంకు దగ్గరే పడిగాపులు కాయాల్సి వచ్చింది’’
- నస్రీన్, సికింద్రాబాద్
నోట్లు మార్చుకున్న జపాన్ యువతి
జపాన్‌కు చెందిన ఓ యువతి శనివారం బౌద్ధనగర్ డివిజన్ వారాసిగూడ ఎస్‌బీఐలో తన వద్ద ఉన్న భారత పాత నోట్లను ఇచ్చి కొత్త నోట్లను తీసుకున్నారు.
వెలవెలబోతున్న మార్కెట్లు
నోట్ల తిప్పల కారణంగా పాతబస్తీలో అతిపెద్ద కూరగాయల మార్కెటైన మీరాలం మండిలో వినియోగదారుల రద్దీ బాగా తగ్గింది. దీంతో స్థానిక వ్యాపారులతో పాటు రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. చిల్లర ఇచ్చే పరిస్థితి లేక కూరగాయల కొనుగోళ్లు తగ్గాయని.. దాంతో మిగిలిన వాటిని చెత్తకుప్పల్లో వేయాల్సిన పరిస్థితి నెలకొందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.