గ్రూపు-2 వద్దు.. మంగళసూత్రమే ముద్దు
గ్రూపు-2 వద్దు.. మంగళసూత్రమే ముద్దు
Published Sat, Nov 12 2016 8:09 AM | Last Updated on Mon, Sep 4 2017 7:55 PM
మంగళసూత్రానికే పరీక్ష పెట్టారు గ్రూప్-2 అధికారులు. శుక్రవారం జరిగిన గ్రూపు-2 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష హాల్‌లోకి వెళ్లేముందు తమ ఒంటిపై ఉన్న రింగ్, చైన్లు, నగదు, మెట్టెలు, గాజులతో పాటు మంగళసూత్రాలను కూడా తీసేసి వెళ్లాలని అధికారులు చెప్పడంతో అభ్యర్థులు ఆశ్చర్యానికి గురయ్యారు. మహిళా అభ్యర్థులతో పాటు వచ్చిన వారి భర్తలు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.
హైదరాబాద్‌లోని భోలక్‌పూర్‌లోని అంజుమన్ సొసైటీ పరీక్ష కేంద్రం వద్ద ఓ మహిళా అభ్యర్థిని మంగళసూత్రం తీసి కేంద్రంలోకి వెళ్లాలని అధి కారులు చెప్పగా అందుకు ఆమె నిరాకరించింది. అసలే శుక్రవారం అని, తాను మంగళసూత్రం తీయబోనని కరాఖండిగా చెప్పింది. దీంతో అధికారులు ఆమెను లోపలికి అనుమతించకపోవడంతో వెనుదిరిగింది. ఇలాంటి నిబంధనలు పెట్టడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Advertisement