
మహామనీషి పుస్తకావిష్కరణ : జగన్
సాక్షి, హైదరాబాద్: దివంగత వైఎస్సార్ పాలనపై కవి, పాత్రికేయుడు మర్రిపూ డి దేవేంద్రరావు రచించిన ‘మహామనీషి’ కవితాసంపుటిని వైఎస్సార్ కాంగ్రె స్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం తన నివాసంలో ఆవిష్కరించారు. సీఎంగా వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రానికి అందించిన సేవలు, చేపట్టిన సంక్షేమ పథకాలపై ప్రధానంగా ఈ కవితలను మర్రిపూడి రచిం చారు. కార్యక్రమంలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ చిత్తూరు నేత జి.లక్ష్మీపతి, బీసీ నాయకుడు బి.దేవరాజు పాల్గొన్నారు.