
చంద్రబాబు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టనుంది. గురువారం ఉదయం వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ఏపీ అసెంబ్లీ కార్యదర్శిని కలసి నోటీసులు అందజేశారు.
అనంతరం మీడియా పాయింట్ వద్ద వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైనందుకు నిరసనగా నోటీసులు అందజేసినట్టు చెప్పారు. ఎన్నికల హామీల అమలులో మాటతప్పడంతో పాటు ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలమైందని, అవినీతిలో మునిగితేలుతోందని ఆరోపించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చంద్రబాబు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటీవల నిర్ణయించిన సంగతి తెలిసిందే.