'బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ను అవమానించేలా ఉంది' | ysrcp unhappy with union Budget as no package for andhra pradesh | Sakshi
Sakshi News home page

'బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ను అవమానించేలా ఉంది'

Published Tue, Mar 1 2016 12:54 PM | Last Updated on Sat, Jul 28 2018 6:14 PM

'బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ను అవమానించేలా ఉంది' - Sakshi

'బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ను అవమానించేలా ఉంది'

హైదరాబాద్ :  కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు అవమానం జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి అన్నారు. ఆయన మంగళవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. 'చంద్రబాబు నిస్సహాయ స్థితి, చేతగానితనానికి అద్దం పట్టింది. రాష్ట్రానికి రావాల్సింది చంద్రబాబు కన్నీళ్లు కాదు, అభివృద్ధి.

 

కేంద్రం, రాష్ట్రం కలిసి ప్రజల నోట్లో మట్టి కొట్టారు. 5 కోట్ల ఏపీ ప్రజలను బికారులుగా చేశారు. 2018 కల్లా పోలవరం పూర్తి చేస్తానన్న మంత్రి దేవినేని ఉమ ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారు. ఇప్పటికైనా చంద్రబాబు నోరు విప్పాలి. మన రాష్ట్రానికి రావాల్సిన వాటా కోసం చంద్రబాబు పోరాడాలి.' అని పార్థసారధి సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement