భూమికి తిరిగొచ్చిన అమెరికా అంతరిక్ష విమానం | American space plane returned to Earth | Sakshi
Sakshi News home page

భూమికి తిరిగొచ్చిన అమెరికా అంతరిక్ష విమానం

Published Sun, Oct 19 2014 1:43 AM | Last Updated on Tue, May 29 2018 12:54 PM

భూమికి తిరిగొచ్చిన  అమెరికా అంతరిక్ష విమానం - Sakshi

భూమికి తిరిగొచ్చిన అమెరికా అంతరిక్ష విమానం

లాస్ ఏంజెలిస్: భూమి చుట్టూ 22 నెలల పాటు రహస్యంగా చక్కర్లు కొట్టిన అమెరికా అంతరిక్ష విమానం ‘ఎక్స్-37బీ’ ఎట్టకేలకు  భూమికి క్షేమంగా తిరిగి వచ్చింది. 2012, డిసెంబరులో మూడోసారి నింగికి ఎగిరిన ఈ విమానం శుక్రవారం కాలిఫోర్నియాలోని వైమానిక స్థావరంలో సురక్షితంగా దిగింది. నాసా గతంలో ఉపయోగించిన స్పేస్ షటిల్ వ్యోమనౌకల మాదిరిగా మళ్లీ మళ్లీ ఉపయోగించుకునేందుకు వీలయ్యే అంతరిక్ష విమానం తయారీలో భాగంగా.. అమెరికా ఈ బుల్లి మానవ రహిత విమానాన్ని రహస్యంగా పరీక్షిస్తోంది.

8.8 మీటర్ల పొడవు, 4.5 మీటర్ల వెడల్పు ఉన్న ఈ విమానం మూడోసారి విజయవంతంగా తిరిగిరావడంతో.. అంతరిక్ష విమాన తయారీలో కీలక ప్రగతి సాధించినట్లైందని అమెరికా వాయుసేన ప్రకటించింది. కాగా, ప్రస్తుతం అమెరికా వద్ద బోయింగ్ కంపెనీ రహస్యంగా తయారుచేసిన రెండు ‘ఎక్స్-37బీ’ అంతరిక్ష విమానాలు ఉన్నాయని ‘జిన్హువా’ వార్తాసంస్థ పేర్కొంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement