పూడ్చేసిన మూడు రోజులకు ప్రాణాలతో.. | Baby boy is pulled alive from a shallow grave THREE DAYS after he was left to die | Sakshi
Sakshi News home page

పూడ్చేసిన మూడు రోజులకు ప్రాణాలతో..

Published Fri, Apr 21 2017 9:51 AM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM

పూడ్చేసిన మూడు రోజులకు ప్రాణాలతో.. - Sakshi

పూడ్చేసిన మూడు రోజులకు ప్రాణాలతో..

ప‍్రిటోరియా‌: తాను బిడ్డకు జన్మనివ్వడం తన తల్లిదండ్రులకు తెలిస్తే ఆగ్రహిస్తారని భయపడిన ఓ తల్లి దారుణానికి ఒడిగట్టింది. గుట్టుచప్పుడు కాకుండా తాను పనిచేసేచోటనే బాలుడిని సజీవంగా పూడ్చిపెట్టింది. అయితే.. మూడు రోజుల తరువాత ఆ బాలుడు గుర్తించబడి.. ప్రాణాలతో బయటపడ్డాడు.

వివరాలు.. దక్షిణాఫ్రికాలోని క్వాజులు-నాటల్‌ ప్రావిన్స్‌లో ఉన్న ఓ టింబర్‌ ఫ్యాక్టరీలో పనిచేసే 25 ఏళ్ల మహిళకు ఇటీవల పండంటి మగబిడ్డ జన్మించాడు. అయితే.. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియకూడదని భావించి పనిచేస్తున్న చోటే.. ఫ్యాక్టరీలో దొరికిన కలప ముక్కలతో పాటు కొంత ఇసుకవేసి బాలుడిని పూడ్చివేసింది. ఆ తరువాత మూడు రోజులకు అటుగా వెళ్లిన అక్కడ పనిచేసే వారు శిశువు ఏడుపులు వినిపిస్తుండటంతో పోలీసులకు సమాచారం అందించగా.. వారు బాలుడిని కాపాడారు. ప్రస్తుతం పోర్ట్‌ షెప్‌స్టోన్‌ రీజనల్‌ ఆసుపత్రిలోని ఐసీయూలో బాలుడు చికిత్స పొందుతున్నాడని అధికారులు వెల్లడించారు. తల్లిదండ్రులకు భయపడే ఈ దుశ్చర్యకు పాల్పడ్డానని వెల్లడించిన తల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement