విమానం ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. సోమవారం ఓ విమానం బీచ్లో అత్యవసరంగా దిగగా, మరో విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో అగ్రిప్రమాదం సంభవించింది.
అమెరికాలో ఓ చిన్నపాటి విమానం ఫ్లోరిడా బీచ్లో అత్యవసరంగా దిగింది. ఆ సమయంలో బీచ్లో సరదాగా గడుపుతున్న తండ్రీకూతుళ్లను డీకొంది. ఈ ప్రమాదంలో ఒమ్మి ఇరిజరి అనే వ్యక్తి మరణించగా, ఆయన కూతురు తీవ్రంగా గాయపడింది. ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. విమానంలో ప్రయాణిస్తున్న వారు సురక్షితంగా ఉన్నారు.
బంగ్లాదేశ్కు చెందిన ఓ విమానం నేపాల్లోని ఖాట్మండు విమానాశ్రయంలో అగ్నిప్రమాదానికి గురైంది. విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో చక్రాలు అంటుకున్నాయి. ప్రయాణికులందరినీ వెంటనే దించివేసి మంటలను ఆర్పివేశారు. ఢాకా వెనుదిరగాల్సిన ఈ విమానాన్ని రద్దు చేశారు.
బీచ్లో దిగిన విమానం.. మరో విమానంలో మంటలు
Published Mon, Jul 28 2014 6:48 PM | Last Updated on Fri, Oct 5 2018 8:48 PM
Advertisement
Advertisement