
'నా జీవితమే ఆమె'
వాషింగ్టన్:అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ భార్య హిల్లరీ క్లింటన్ పై ప్రశంసలు కురిపించాడు. తన కష్టంలో ఎప్పుడూ హిల్లరీ చేదోడు వాదోడుగా నిలవడమే కాకుండా.. కుటుంబానికి పెద్ద అండగా నిలబడుతూ వస్తుందని బిల్ క్లింటన్ స్పష్టం చేశారు. భార్య హిల్లరీ కంటే ఏ కార్యక్రమమూ కూడా తనకు ఎక్కువ కాదన్నారు.
హిల్లరీతో జీవిత భాగస్వామ్యం గురించి ఓ ఇంటర్యూలో మాట్లాడిన క్లింటన్ పై విధంగా స్పందించాడు. 'మా 40 ఏళ్ల వైవాహిక జీవితంలో ఎప్పుడూ హిల్లరీ నా వెంటే ఉంది. నా కెరీర్ అభ్యున్నతికి భార్య హిల్లరీ ఎంతగానో సాయపడింది. కొన్ని సంక్లిష్ట సమయాల్లో నాపై ఆమె తీసుకునే జాగ్రత్త నిజంగా అద్భుతం' అని క్లింటన్ పేర్కొన్నారు.
తామిద్దరం ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటూ ముందుకు వెళతామని ఆయన స్పష్టం చేశారు. ఆ క్రమంలోనే తమ మధ్య ప్రేమ బంధం బలపడుతూ వస్తుందన్నారు. అయితే అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడేందుకు సిద్ధమవుతున్నహిల్లరీ క్లింటన్ కు ఇప్పటివరకూ బిల్ క్లింటన్ నుంచి ఎటువంటి సహకారం లభించలేదు. కాగా, శనివారం నుంచి హిల్లరీ ప్రారంభిస్తున్న తొలి ర్యాలీలో బిల్ క్లింటన్ పాల్గొనే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి.