కరోనా: మనుషులపై పని చేస్తున్న వ్యాక్సిన్​ | BioNtech and Pfizers vaccine shows potential to fight ncov | Sakshi
Sakshi News home page

మనుషులపై పని చేస్తున్న వ్యాక్సిన్​

Published Thu, Jul 2 2020 10:56 AM | Last Updated on Thu, Jul 2 2020 11:22 AM

BioNtech and Pfizers vaccine shows potential to fight ncov - Sakshi

ఫ్రాంక్​ఫర్ట్​, జర్మనీ: కరోనా వైరస్​ను కట్టడి చేసేందుకు మరో వ్యాక్సిన్​ రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం నాలుగో స్టేజ్​ తొలిదశలో ఉన్న వ్యాక్సిన్​ , మనుషులపై చేసిన ప్రయోగాల్లో మంచి ఫలితాలను ఇస్తోందని జర్మనీకి చెందిన బయోఎన్​టెక్​, అమెరికాకు చెందిన ఫిజెర్ కంపెనీలు బుధవారం సంయుక్తంగా ప్రకటించాయి. (రెమ్‌డెసివిర్‌ మొత్తం మాకే!)

దీంతో ప్రపంచవ్యాప్తంగా మనుషులపై టెస్టులు జరుపుతున్న వ్యాక్సిన్ల సంఖ్య 17కి చేరింది. వ్యాక్సిన్​ ప్రకటనలతో ఇరు కంపెనీల షేర్లు ఎగసిపడ్డాయి. బయోఎన్​టెక్​ కంపెనీ షేర్లు ఎనిమిది శాతం, ఫిజర్ షేర్ 4.4 శాతం పెరిగాయి. మరోవైపు కోవిడ్​–19 వ్యాక్సిన్​కు ప్రయత్నిస్తున్న మోడర్నా, నోవావాక్స్​ కంపెనీల షేర్లు పతనమయ్యాయి. (పాక్‌తో చేతులు కలిపిన చైనా?) 

24 మంది వాలంటీర్లపై టెస్టులు
బీఎన్​టీ162బీ1 అనే మందును 24 మంది వాలంటీర్లకు ఇవ్వగా 28 రోజుల తర్వాత వారి శరీరంలో పెద్దమొత్తంలో కరోనా వైరస్​ యాంటీ బాడీస్​ తయారయ్యాయని బయోఎన్​టెక్​ వెల్లడించింది. 

వీరికి మూడు వారాల్లో రెండు డోసుల చొప్పున ఇంజెక్షన్​ ఇచ్చినట్లు తెలిపింది. రెండో ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ప్రతి నలుగురిలో ముగ్గురికి స్వల్పంగా జ్వరం( తాత్కలిక సైడ్​​ ఎఫెక్ట్) వచ్చినట్లు వివరించింది. 

మరో గ్రూప్​లోని వారికి ఎక్కువ మోతాదులో ఒకసారి మాత్రమే మూడో డోస్​ ఇంజెక్షన్ ఇచ్చినట్లు చెప్పింది. ‘మా ట్రయల్స్​లో వ్యాక్సిన్​ మనిషి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతున్నట్లు తెలిసింది. రానున్న రోజుల్లో పెద్ద సంఖ్యలో ట్రయల్స్​ నిర్వహిస్తాం’ అని బయోఎన్​టెక్​ సీఈవో సాహిన్​ పేర్కొన్నారు.

అన్ని అనుమతులు వస్తే జులై​ చివరకు అమెరికా, యూరప్​లోని 30 వేల ఆరోగ్యమంతమైన వ్యక్తులపై బయోఎన్​టెక్​, ఫిజర్​ వ్యాక్సిన్​ను పరీక్షించే అవకాశం ఉంది. ఆ తర్వాత మార్కెట్​ అనుమతులు జారీ చేస్తే, 2020 డిసెంబర్​ నాటికి ఒక కోటి వ్యాక్సిన్లు, 2021 చివరకు 120 కోట్ల వ్యాక్సిన్లను కంపెనీ రెడీ చేస్తుంది.

కరోనాను ఎదుర్కొనేందుకు బయోఎన్​టెక్​ మరో మూడు రకాల వ్యాక్సిన్లపై కూడా ప్రయోగాలు చేస్తోంది. వీటి ఫలితాలు ఇంకా వెల్లడి కాలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement