
బట్టతలకు ఎన్ని రకాల ట్రీట్‌మెంట్లు తీసుకున్నా ఫలితం లేదా..? అయితే ఇంకొంత కాలం వేచి చూడండి.. తలపై మళ్లీ వెంట్రుకలు పెరిగేలా చేసే సరికొత్త చికిత్స అందుబాటులోకి వచ్చేస్తోంది అంటున్నారు అమెరికాలోని సదరన్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. శరీరంలోని ఏ కణంలా అయినా మారగలిగే మూలకణాలనే పోలిన ప్రొజెనిటర్ కణాల ద్వారా ఇది సాధ్యమవుతోందని చెబుతున్నారు.
ప్రొజెనిటర్ కణాలు ఆర్గనాయిడ్స్‌గా అంటే అవయవాన్ని పోలినట్లు మారగలవని తమ పరిశోధనల్లో తెలిసిందని, ఆ తర్వాత దశల వారీగా ఈ ఆర్గనాయిడ్స్ ఉన్న చోట చర్మం, వెంట్రుక కుదుళ్లు ఏర్పడ్డాయని.. వీటిని ఎలుక చర్మంపై ఏర్పాటు చేసినప్పుడు అక్కడ వెంట్రుకలు పెరిగాయని శాస్త్రవేత్తలు తెలిపారు. బట్టతల ఉన్న వారి నుంచే ప్రొజెనిటర్ కణాలను సేకరించి లేబొరేటరీల్లో వెంట్రుకల కుదుళ్లు కలిగిన చర్మాన్ని అభివృద్ధి చేస్తారని.. ఈ చర్మాన్ని తలపై అతికించడం ద్వారా అక్కడ వెంట్రుకలు పెరిగి బట్టతల మాయమవుతుందని భావిస్తున్నారు. త్వరలోనే ఈ పద్ధతిని మానవులపై పరీక్షిస్తామని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment